![]() |
![]() |

బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ప్రేమ ఎంత మధురం`. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సీరియల్ గత కొంత కాలంగా విజయవంతంగా ప్రసారం అవుతూ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. రేటింగ్ పరంగానూ దూసుకుపోతోంది. సరికొత్త కథ కథనాలతో సాగుతున్న ఈ సీరియల్ ప్రస్తుతం ఎండింగ్ దశకు చేరుకుంది. ఇందులో శ్రీరామ్ వెంకట్, వర్ష హెచ్ కె జంటగా నటించారు. ఇతర పాత్రల్లో జయలలిత, బెంగళూరు పద్మ, విశ్వమోహన్, రామ్ జగన్, రాధాకృష్ణ, అనుషా సంతోష్, కరణ్, మధుశ్రీ, ఉమాదేవి, జ్యోతిరెడ్డి తదితరులు నటించారు.
ఆర్య వర్ధన్ అనుభవిస్తున్న ఆస్తి మొత్తం తన అక్క రాజనందినిదేనని, అయితే ఆ ఆస్తిని తనకు రాసి ఇచ్చిందని రాగసుధ ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్ లు చూపించి ఆర్యను ఇరకాటంలో పెడుతుంది. అయితే వాటి ఆధారంగా ఆస్తి రాగసుధకే చెందుతుందని తీర్పు ఇచ్చే సమయంలో ఆర్య వర్ధన్ తరుపు లాయర్ నా క్లైంట్ కి చివరగా ఒక్క అవకాశం ఇవ్వండని, తగిన ఆధారాలతో నిరూపిస్తామని కోరతాడు. దీనికి న్యాయమూర్తి ఓకే అంటాడు.
నెల రోజుల గడువు కోరితే ఆర్య మాత్రం జస్ట్ వన్ డే చాలంటాడు. తను కోరిన ప్రకారమే ఒక్క రోజు గడువు ఇస్తాడు. కట్ చేస్తే బస్తీ వాసులు ఆర్యని మళ్లీ కస్టడీకి అంగీకరించేది లేదంటూ పోలీస్టేష్ ఎదుట ఆందోళనకు దిగుతారు. సుబ్బు చెప్పినా పట్టించుకోకుండా స్టేషన్ ని చుట్టుముడతారు. దీంతో అక్కడికి వచ్చిన ఆర్య ఆశ్చర్యపోతాడు. దయచేసి శాంతించండి అని చెబుతాడు. అయినా వినకపోవడంతో అను వచ్చి సర్ధి చెబుతుంది. ఇదే సమయంలో ఆర్యని కాపాడుకోలేకపోతున్నానని కుమిలిపోతుంది. నేను మీకు తగను, మళ్లీ బస్తీకే వెళ్లిపోతాను అంటుంది. అప్పుడు అనుకు ఆర్య ఓ రహస్యం చెబుతాడు. వెంటనే ఇంటికి వెళ్లిన అను.. హత్య చేయడానికి మారనాయుధం..తో పాటు మరి కొన్ని ప్రాపర్టీస్ కావాలని నీరజ్ తో అంటంది. అది విని నీరజ్ తో పాటు ఆర్య తల్లి ఆర్చర్యపోతుంది. ఆ తరువాత ఏం జరిగింది అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.
Anu to Execute a Masterplan,Prema Entha Maduram Serial Today episode,Prema Entha Maduram ,Anu,Arya Vardhan,Raga Sudha
![]() |
![]() |